Jagan: శ్రీకాకుళం జిల్లా నేతలతో జగన్ సమావేశం..! 17 d ago
AP: తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా నేతలతో మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ సమావేశమయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. భవిష్యత్తు కార్యచరణపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.